: ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి... ఘన స్వాగతం పలికిన చంద్రబాబు
వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ఈరోజు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమల బయల్దేరి వెళ్లారు. కాసేపటి క్రితం, ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రణబ్ కు ఎయిర్ పోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి వారు తిరుచానూరు అమ్మవారి దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. వారి వెంట గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు.