: బెయిల్ ఆర్డర్లో సందిగ్ధత... ఇంకా విడుదలకాని రేవంత్ రెడ్డి!
ఈ ఉదయం చర్లపల్లి జైలు నుంచి తమ నేత రేవంత్ రెడ్డిని భారీ ఊరేగింపుతో తీసుకెళ్లాలని వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అసహనానికి గురవుతున్నారు. ఓటుకు నోటు కేసులో బెయిలు పొందిన రేవంత్ రెడ్డి విడుదలలో జాప్యం జరుగుతోంది. ఏసీబీ నుంచి వచ్చిన బెయిల్ ఆర్డర్ లో కొంత సందిగ్ధత నెలకొని వుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నెల రోజుల పాటు జైల్లో ఉన్న రేవంత్ కు ఘనస్వాగతం పలికేందుకు ఆయన నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కాగా, కొంత ఆలస్యంగానైనా చర్లపల్లి జైలు నుంచి రేవంత్ విడుదల కానున్నారని లాయర్లు తెలిపారు.