: నాపై చార్జ్ షీటా?... కోర్టులోనే తేల్చుకుంటా: ఎంపీ కొత్తపల్లి గీత


ఓ బ్యాంకును మోసగించారంటూ అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం తెలిసిందే. ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో గీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని, కంపెనీలో ఎలాంటి హోదా లేని తనపై ఎలా చార్జ్ షీట్ దాఖలు చేస్తారంటూ సీబీఐ చర్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని చెప్పారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి తన భర్త ఎండీగా ఉన్నారని, అందులో స్వల్పకాలం పాటు భాగస్వామిగా కొనసాగానని, అనంతరం, 2012లో బయటికి వచ్చానని వెల్లడించారు. అంతకుముందే 2009లో బ్యాంక్ నుంచి కంపెనీ పేరిట లోన్ తీసుకున్నామని, అందుకోసం సరైన పత్రాలనే సమర్పించామని తెలిపారు. తమకు ఓ సింగపూర్ కంపెనీతో భాగస్వామ్యం ఉందని, అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కంపెనీ వాటాలు వెనక్కి తీసుకుందని, భాగస్వామ్యం నుంచి తప్పుకుందని, దాంతో తమకు నష్టాలు వచ్చాయని గీత వివరించారు. సాధ్యమైనంత త్వరలో బ్యాంకుకు రుణం చెల్లిస్తామని చెప్పారు. రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79 కోట్ల రుణం తీసుకున్నారంటూ ఎంపీ గీతపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News