: డబ్ స్మాష్ ముచ్చట తీర్చుకున్న విరాట్ కోహ్లీ
భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ కూడా డబ్ స్మాష్ వీడియోతో అలరించాడు. ఇప్పటికే పలువురు సినీ తారలు, క్రీడా ప్రముఖులు తమ డబ్ స్మాష్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు కోహ్లీ కూడా వారి సరసన చేరాడు. ఆ వీడియోలో కోహ్లీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'హేరా-ఫేరీ' సినిమాలోని బాబూరావ్ పాత్రధారిలా డైలాగు చెప్పాడు. మిత్రుడు సందీప్ రాజ్ ఎదురుగా నిలుచుని ఉండగా, "యే బాబూరావ్ కా స్టైల్ హై" అని డైలాగు వల్లించాడు. కాగా, 'హేరా-ఫేరీ' చిత్రంలో బాబూరావ్ పాత్రను ప్రముఖ నటుడు పరేష్ రావల్ పోషించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.