: అమలాపురం ఎంపీపై చంద్రబాబు ఆగ్రహం... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరిన ముఖ్యమంత్రి!


ఓ జాతీయ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రబాబు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. 24 గంటల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎంపీని ఆదేశించారు. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని జవాన్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. సైనికులంటే టీడీపీకి ఎంతో గౌరవం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 'విమానాల్లో అగ్గిపెట్టెలు తీసుకెళ్లడం సహేతుకమా? భద్రతా ప్రమాణాలు ప్రజా ప్రతినిధులకు వర్తించవా?' అంటూ ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, సైనికులపై ఎంపీ పి.రవీంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ చర్చ సందర్భంగా "ఫ్రీ ఫుడ్, ఫ్రీ డ్రింక్, ఫ్రీ హాలిడేస్"... అంటూ రవీంద్రబాబు సైనికులను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సదరు పార్లమెంటు సభ్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజాయిషీ నోటీసు ఇచ్చారు.

  • Loading...

More Telugu News