: అలకవీడిన బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే... పార్టీని వీడేదిలేదన్న సుజయకృష్ణ


వైఎస్ఆర్ కాంగ్రెస్ బొబ్బలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అలకవీడారు. పార్టీలో బొత్స సత్యనారాయణను చేర్చుకున్నారన్న కారణంతో పార్టీ అధినేత జగన్ పై అలకబూనిన ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో జగన్ ను కలసి సుజయకృష్ణ వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. జగన్ ను కలసిన వారిలో సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు పార్టీవీడే ఆలోచన లేదని, తాను పార్టీకి నష్టం కలిగించబోనని స్పష్టం చేశారు. తాను టీడీపీ నేతలెవరిని కూడా కాంటాక్ట్ చేయలేదని కూడా పేర్కొన్నారు. బొత్స పార్టీలో చేరినప్పుడు వ్యక్తిగత కారణాలతో తాను హైదరాబాద్ రాలేకపోయానని తెలిపారు. పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై జగన్ తో చర్చించానన్నారు.

  • Loading...

More Telugu News