: ఫిన్ లాండ్ నూతన ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
ఫిన్ లాండ్ కొత్త ప్రధాని జుహా సిపిలాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో నెగ్గి ప్రధాని పీఠం అధిష్ఠించిన సిపిలాను అభినందిస్తూ ఆయన ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు కలిసి పనిచేద్దామంటూ మోదీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇరు దేశాలు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఆధారంగా నెలకొన్న సుహృద్భావ సంబంధాలను ఆస్వాదించాయని, మున్ముందు ఇదే రీతిలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. సిపిలా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.