: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత, డిమాండ్ తగ్గడం నేపథ్యంలో గత రెండు రోజులు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. రూ.100 తగ్గిన పసిడి ధర 10 గ్రాములు రూ.26,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.550 తగ్గి కేజీ ధర రూ.36,150కు చేరింది. డాలరు బలపడుతుండటం, నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో డిమాండ్ తగ్గిందని, అందుకే వీటి ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.