: కొత్త వంద నోటు ఎలా ఉంటుందో తెలుసా?


రిజర్వ్ బ్యాంకు భారతీయ కరెన్సీకి మరిన్ని భద్రతాంశాలు జోడించింది. నకిలీ కరెన్సీ దేశ సరిహద్దుల్లోకి దూసుకొస్తుండడంతో ఆర్బీఐ కొత్త కరెన్సీని వాడుకలోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నేడు కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎరుపు రంగులో ఉండే అంకెల్లో మార్పులు చేసింది. గాంధీజీ తలపై, నాలుగు సింహాల బొమ్మ ప్రక్కన ఉండే ఈ అంకెల పరిమాణం మార్చింది. ఇవి చిన్న అంకెలుగా ప్రారంభమై పెద్దగా మారుతాయి. తాజా మార్పులతో నకీలీలకు బ్రేక్ పడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. పాత నోట్లలో ఈ అంకెల పరిమాణం సమానంగా ఉంటుంది. కొత్త వాటిలో మార్పులు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.

  • Loading...

More Telugu News