: టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడం: ఎల్.రమణ
టీఆర్ఎస్ తప్పుడు కేసులకు భయపడేది లేదని... ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. ప్రజాసమస్యలపై టీడీపీ పోరాడుతూనే ఉంటుందని... పోరాటంలో రాజీ లేదని తెలిపారు. కార్యకర్తల అండతో, మొక్కవోని ధైర్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై పోరాడతామని అన్నారు. కేవలం కుట్రతోనే తమ సహచరుడు రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని చెప్పారు. రేవంత్ కు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.