: రేవంత్ రెడ్డికి ఊరట... బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో ఏ-1 నిందితుడు అయిన రేవంత్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల వ్యక్తిగత పూచికత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని, విచారణ నిమిత్తం ఏసీబీ ఎప్పుడు కోరితే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికితోడు, హైదరాబాదులో కాని, లేదా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో మాత్రమే రేవంత్ ఉండాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంతవరకు ఈ రెండు ప్రాంతాలను దాటి రాకూడదని రేవంత్ కు ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులైన ఏ-2 సెబాస్టియన్, ఏ-3 ఉదయ్ సింహలకు కూడా ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటకు వస్తే సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News