: 'మ్యాగీ' బాటలో 'టాప్ రామన్'
'మ్యాగీ' బాటలో మరో నూడుల్స్ తయారీ ప్రోడక్ట్ 'టాప్ రామన్' నడుస్తోంది. మోనోసోడియం గ్లూటామేట్, సీసం పరిమాణం నిబంధనలకు మించి ఉండడంతో 'మ్యాగీ' నూడుల్స్ పై భారతీయ మార్కెట్లో నిషేధం పడిన సంగతి తెలిసిందే. దీంతో 320 కోట్ల రూపాయల విలువైన 'మ్యాగీ' నూడుల్స్ ను 'నెస్లే' కంపెనీ ధ్వంసం చేసింది. అదే కారణంతో 'నిస్సాన్' కంపెనీ తయారు చేస్తున్న 'టాప్ రామన్' నూడుల్స్ ప్యాకెట్లను భారతీయ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటోంది. కేంద్ర ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)నుంచి అందిన ఉత్తర్వుల మేరకు 'నిస్సాన్' ఈ నిర్ణయం తీసుకుంది. 'హిందుస్థాన్ యునిలీవర్' సంస్థ తయారు చేస్తున్న 'నార్' నూడుల్స్ ను కూడా ఉపసంహరించుకుంది. తాజా ఫలితాలతో భారతీయ మార్కెట్లో ఇన్ స్టాంట్ పోషకాల పేరుతో లభ్యమవుతున్న అన్ని 'నూడుల్స్', 'పాస్తా', 'మాకరోనీ'పై పరీక్షలు నిర్వహించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది.