: రాష్ట్రపతి గౌరవార్థం రేపు గవర్నర్ విందు... చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్ లో రేపు సాయంత్రం 7 గంటలకు విందు ఇవ్వబోతున్నారు. దానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు సతీసమేతంగా హాజరుకావాలంటూ గవర్నర్ ఆహ్వానించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. పది రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అయితే రేపటి గవర్నర్ విందుకు వారిద్దరూ హాజరై మాట్లాడుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.