: 'వాట్స్ యాప్' ద్వారా కాపీ కొట్టే ప్రయత్నం... బుక్కయిన విద్యాధికుడు
అతని పేరు రిమోన్ హసన్. బాగా చదువుకున్న వాడే. అయితేనేం, బుద్ధి వక్రించింది. యూజీసీ నెట్ 2015 పరీక్షలకు హాజరై, టెక్నాలజీని ఉపయోగించుకుని గట్టెక్కాలని చూశాడు. ప్రశ్నాపత్రాన్ని ఫోటోలు తీసి వాట్స్ యాప్ ద్వారా పంపించి సమాధానాలు తెప్పించుకునే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. యూజీసీ నెట్ మూడవ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను ఫోటో తీసి షేర్ చేస్తున్న హసన్ ను ప్రిన్సిపాల్ స్రబోనీ సమంతా గమనించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు హసన్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.