: ప్రముఖ కళాకారుడి దీన స్థితిపై స్పందించిన కేటీఆర్... ఆర్థిక సాయం


ప్రముఖ కళాకారుడు మాదాసు నాగయ్య దీన స్థితిని తెలుసుకున్న టీఎస్ మంత్రి కేటీఆర్ వేగంగా స్పందించారు. తక్షణ సాయంగా లక్ష రూపాయలను ఆయనకు అందించారు. అంతేకాకుండా, వృద్ధ కళాకారుల పింఛను కింద ఆయనకు ప్రతినెలా రూ. 1500 పింఛను అందజేస్తామని తెలిపారు. తెలంగాణలోని కళాకారులకు ఆర్థిక సాయాన్ని అందించాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని కేటీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News