: భారత ఉద్యోగులకు ఎంత డిమాండో!: డేల్ కార్నెగ్ నివేదిక


ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలకు ఇండియా నుంచి వచ్చే ఉద్యోగులంటే ఎంతో మక్కువని డేల్ కార్నెగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఇచ్చిన పనిని పూర్తి చేసేందుకు అదనపు సమయం పనిచేసేందుకు ఇండియన్స్ ముందుండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. ఉద్యోగుల నియామకాల్లో 46 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారని తెలిపింది. ప్రపంచ సరాసరి నియామకాల్లో 34 శాతం, యూఎస్ ఉద్యోగుల్లో 30 శాతం ఇండియన్స్ ఉన్నారని తెలిపింది. ఇండియాలో ఉన్నత విద్య స్థాయి అమెరికా చదువులతో పోలిస్తే అధికంగా ఉండడం కూడా భారతీయులకు మరిన్ని ఉద్యోగాలను తెచ్చి పెడుతోందని 'ఎంప్లాయీ ఎంగేజ్ మెంట్' పేరిట విడుదలైన నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా తమ ప్రశ్నలకు స్పందించిన ఉద్యోగుల్లో 61 శాతం మంది అదనపు వేతనం లేకుండానే పని గంటలు పెంచుకునేందుకు సిద్ధపడ్డారని తెలిపినట్టు డేల్ కార్నెగ్ వివరించింది. మరో 58 శాతం మంది కంపెనీకి తమ నుంచి ఏం కావాలన్న విషయం తెలుసునని చెప్పగా, మరో 58 శాతం మంది సంస్థ విజయానికి తాము ఏ పనైనా చేస్తామని వెల్లడించారు. ఇక సెక్టార్ల వారీగా పరిశీలిస్తే, వైద్య ఆరోగ్య రంగాలు అత్యధిక ఉద్యగాలను ఇస్తున్నాయి. సంవత్సరానికి రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వేతనం తీసుకుంటున్న వారితో పోలిస్తే రూ. 1 కోటికి పైగా వేతనం తీసుకుంటున్నవారు మరింతగా కష్టపడుతున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News