: మా జడ్పీటీసీల ఆచూకీ దొరికేదాకా ఎన్నిక వాయిదా వేయండి...గవర్నర్ కు వైసీపీ విజ్ఞప్తి
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. ఏపీలో జరుగుతున్న ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీని చేజిక్కించుకునేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందంటూ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన దాదాపు 35 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆచూకీ గల్లంతైందని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలు కనిపించేదాకా ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఆచూకీ లభించని తమ నేతలను కిడ్నాప్ చేసిన టీడీపీ, ఇతర రాష్ట్రాల్లో దాచిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.