: కుప్పకూలిన గ్రీస్, స్టాక్ మార్కెట్లు క్లోజ్... 'బేర్'మన్న ప్రపంచ మార్కెట్లు


యూరోజోన్ సభ్యదేశం గ్రీస్ కుప్పకూలింది. తీసుకున్న అప్పులు తీర్చే మార్గం లేక దివాలా తీసింది. అప్పులు తీర్చేందుకు ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోవడంతో చేసేదేమీ లేక స్టాక్ మార్కెట్లను, బాండ్ల మార్కెట్ నూ మూసివేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. రుణాల తిరిగి చెల్లింపు ప్రణాళికలను ఆ దేశ పార్లమెంటు ప్రకటించగా, దానికి రుణదాతలు అంగీకరించని సంగతి తెలిసిందే. దీంతో యూరోజోన్ నుంచి గ్రీస్ 'ఎగ్జిట్' తప్పకపోవచ్చని ముందే ఊహాగానాలు వచ్చాయి. జోన్ నుంచి గ్రీస్ బయటకు వస్తే, ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పెయిన్, పోర్చుగల్ కూడా వస్తే అదే దారిలో నడుస్తాయన్న నిపుణుల ఊహాగానాలు భయాలను మరింతగా పెంచాయి. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం 9 గంటల సమయానికి జపాన్ నిక్కీ 2 శాతం, కొరియా మార్కెట్ స్ట్రెయిట్స్ టైమ్స్ 1.26 శాతం, హాంకాంగ్ సూచిక హాంగ్ సెంగ్ 2.41 శాతం, తైవాన్ సూచిక వెయిటెండ్ 2.48 శాతం, చైనా సూచిక షాంగై కంపోజిట్ 2.49 శాతం పతనమయ్యాయి. మరోవైపు యూరప్ మార్కెట్లో ముందస్తు అమ్మకాలకు వాటాలు వెల్లువెత్తుతుండగా, ఫ్యూచర్స్ సూచీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News