: విజయనగరం జిల్లాలో సెక్షన్-30 అమలు


జిల్లాలో సెక్షన్-30 అమలు చేస్తున్నట్టు విజయనగరం అడిషనల్ ఎస్పీ రమణ తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విమానాశ్రయ నిర్మాణానికి భోగాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సెక్షన్-30 ప్రకారం నిరసనలు, ఆందోళనలు చేయాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News