: వైన్ షాపుల కోసం ఎంత పోటీయో... 3,061 షాపులకు 52,699 దరఖాస్తులు


ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లను పొందాలని వేలాది మంది పోటీ పడుతున్నారు. దీంతో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లోని 3,061 దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 52,699 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మరిన్ని దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నట్టు వివరించారు. ఒక్కో వైన్ షాపునకు సరాసరిన 17 మందికి పైగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో మద్యం షాపులకు పోటీ అధికంగా ఉందని, ఇక్కడ 303 దుకాణాలకు గాను ఒక్క దుకాణానికి 33 మందికి పైగా పోటీ పడుతూ 10 వేలకు పైగా దరఖాస్తులు అందాయని తెలిపారు. కాగా, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా దుకాణాల కేటాయింపు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News