: 2016లో కూడా అధికారం మాదే!: మమతా బెనర్జీ


2016లో కూడా పశ్చిమ బెంగాల్ లో అధికారం తమదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రానున్న ఎన్నికలపై ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే తుది తీర్పని అన్నారు. గడచిన నాలుగేళ్లలో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తమ పార్టీకి అధికారం కట్టబెడుతుందని చెప్పారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలన్నీ అప్పుడే ప్రచారం చేపట్టాయి. బీజేపీ, వామపక్ష పార్టీలు విమర్శలు చేస్తుండగా, మమతా దీదీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News