: భారతీయుడనే గుర్తింపు కంటే 'గోవన్' అనిపించుకోవడమే గొప్ప: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు


భారతీయుడనే గుర్తింపు కంటే 'గోవన్' ఐడెంటిటీయే గొప్పదని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ సారి గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో కలిసి పోర్చుగల్ వెళ్లానని, అక్కడి వారంతా ఫ్రాన్సిస్ ను ఇండియన్ గా కంటే గోవన్ గా గుర్తించడం ఆశ్చర్యపరచిందని అన్నారు. భౌగోళికంగా గోవా భారతదేశంలోని ఓ రాష్ట్రమే కావచ్చు, కానీ చారిత్రక, సంస్కృతిక వారసత్వాల దృష్ట్యా గోవాకు ప్రత్యేకత ఉందని అన్నారు. తన అత్తవారిల్లు కూడా గోవాలోనే, పనాజీకి సమీపంలోని రిబాందర్ లో ఉందని అన్నారు. తన భార్య అక్కడే పుట్టి పెరిగారని తెలిపారు.

  • Loading...

More Telugu News