: ప్రముఖ సినీ నటుడు దివంగత హరనాధ్ భార్య మృతి
సుప్రసిద్ధ సినీనటుడు దివంగత 'హరనాధ్' భార్య భానుమతీదేవి (71) ఈరోజు మద్యాహ్నం 1.30 గంటలకు చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకు కుమారుడు శ్రీనివాసరాజు ('గోకులంలో సీత', 'రాఘవేంద్ర' చిత్రాల నిర్మాత) కుమార్తె పద్మజ ఉన్నారు. కుమార్తె భర్త ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు ('తొలిప్రేమ' నిర్మాత). భానుమతీదేవి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.