: పార్టీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం...తాజా రాజకీయ పరిణామాలపైనే దృష్టి
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో మరికాసేపట్లో కీలక భేటీ నిర్వహించనున్నారు. విజయవాడలోని శేషసాయి కళ్యాణమండపంలో జరగనున్న ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలంతా హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకే చంద్రబాబు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలపైనే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.