: ఫ్రాన్స్ లో పంజా విసిరిన ఐఎస్ఐఎస్
ఫ్రాన్స్ లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. తూర్పు ఫ్రాన్స్ లోని గ్రెనోబుల్ సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ గ్యాస్ ఫ్యాక్టరీపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఫ్యాక్టరీ గేటు సమీపంలో మొండెం నుంచి తలను వేరుచేయబడిన మృతదేహాన్ని గుర్తించారు. అంతేకాకుండా ఐఎస్ఐఎస్ జెండా కూడా దొరికింది. దీంతో, ఈ దాడికి పాల్పడింది ఆ ఉగ్రవాద సంస్థే అనే విషయం అర్థమవుతోంది. తమ దేశంలో ఐఎస్ ఉనికి ఉన్నట్టు తేలడంతో ఆ దేశ పౌరుల్లో అలజడి మొదలైంది.