: గుజరాత్ లో 70 మందిని బలిగొన్న భారీ వర్షాలు
గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటి వరకు భారీ వర్షాలతో 70 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అమ్రేలీ ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని... కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే 26 మంది చనిపోయారని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.