: కోహ్లీ, అనుష్క విడిపోయారా?
ఈ మధ్య కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన వాటిలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల ప్రేమ కథ ఒకటి. దేశంలోనే కాదు, టీమిండియా విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో కూడా అనుష్క అక్కడ వాలిపోయేది. వారిద్దరూ ఒకర్ని వదలి మరొకరు ఉండలేనంతగా, చెట్టాపట్టాలు వేసుకుని వెళ్తున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేశాయి. సెంచరీ కొట్టగానే గ్రౌండ్ నుంచి గ్యాలరీలో కూర్చున్న తన ప్రియురాలికి విరాట్ పంపిన ఫ్లయింగ్ కిస్సులు పెద్ద చర్చనే లేవదీశాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో ఒక మ్యాచ్ సందర్భంగా విరాట్ దగ్గరకు వచ్చి అతనితో అనుష్క ముచ్చటించడం దుమారాన్నే లేపింది. అంత ఘాటు ప్రేమలో తడిసి ముద్దైన ఈ లవ్ జంట... ఇప్పుడు విడిపోయిందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకు ముందులా వీరిద్దరూ కలవడం లేదని అంటున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని, ఇకపై ఎక్కువ రోజులు కలసి ఉండలేరని బాలీవుడ్ జనాలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.