: సీమకు నికరజలాలు కేటాయించాల్సిందే... జలసాధన దీక్షలో బైరెడ్డి డిమాండ్
తీవ్ర కరవుకు నెలవైన రాయలసీమకు నికర జలాలు కేటాయించాల్సిందేనని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకు జలాల కోసం జలసాధన దీక్ష పేరిట ఆయన కొద్దిసేపటి క్రితం కర్నూలులోని జలమండలి కార్యాలయం ముందు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన బైరెడ్డి, రాయలసీమకు నికరజలాల కేటాయింపుతో ఏ ప్రాంతానికీ నష్టం లేదని చెప్పారు. జనాభా లేదా భూభాగం ప్రాతిపదికగా రాయలసీమకు నికర జలాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.