: ప్రజలకు మరింత ఊరట... ఆ నోట్లు మార్చుకునేందుకు డిసెంబర్ వరకూ గడువు
2005 కంటే ముందు ఉన్న కరెన్సీ నోట్ల మార్పిడి గడువు విషయంలో ప్రజలకు మరింత ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వీటిని డిసెంబర్ 31, 2015 వరకు మార్చుకోవచ్చని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను జూన్ 30 లోపు మార్చుకోవాలని గతంలో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, 2005 కంటే ముందు ఉన్న కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగించడం ఇది రెండోసారి. ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ బీఐ ఒక ప్రకటనలో తెలియజేసింది.