: చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా!: మోదీ ‘ఎమర్జెన్సీ’ ట్వీట్లకు కేటీఆర్ కౌంటర్!


దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి యుగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో ఎమర్జెన్సీ అమలై 40 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన తన స్పందనను తెలియజేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ... 40 ఏళ్ల తర్వాత, ఇప్పుడు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో శాంతిభద్రతలపై... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కును కాలరాస్తారని/ ఉల్లంఘిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేకవంతంగా వ్యవహరిస్తారని, చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా’’ అంటూ స్పందించారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.

  • Loading...

More Telugu News