: గ్రానైట్ వ్యాపారి ఇంటిలో భారీ చోరీ... పట్టపగలే బరితెగించిన చోరులు


ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో నిన్న పట్టపగలు భారీ చోరీ జరిగింది. నగరంలోని ఓ గ్రానైట్ వ్యాపారి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఆ ఇంటిలోని బీరువాను పగులగొట్టి రూ.35 లక్షల విలువ చేసే నగలు, నగదు అపహరించుకుని వెళ్లారు. పగలు పని నిమిత్తం బయటకు వెళ్లిన గ్రానైట్ వ్యాపారి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చోరీ జరిగిన విషయం వెలుగు చూసింది. ఈ విషయంపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News