: ఇది రాకాసి వంతెన... శునకాలు దూకేస్తాయట!


స్కాట్లాండ్ లోని వెస్ట్ డన్ బార్టన్ షైర్ లో ఓ పాతకాలపు వంతెన ఉంది. దాన్నందరూ దయ్యాల వంతెన అని పిలుస్తారు. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ వంతెన పైనుంచి 600కి పైగా శునకాలు కిందికి దూకాయట. ఇక్కడికి వచ్చిన కుక్కలు ఎవరో ప్రేరేపించినట్టుగా వెంటనే దూకేస్తాయని స్థానికులు అంటున్నారు. అలా దూకిన వాటిలో కనీసం 50 కుక్కలు చనిపోయాయట. ఇక్కడ ఆత్మలు సంచరిస్తుంటాయని, అవే శునకాల ఆత్మహత్యలకు కారణమని ప్రచారంలో ఉంది. వందేళ్ల క్రితం ఇక్కడ జీవించిన 'వైట్ లేడీ ఆఫ్ ఓవర్టన్' ఇప్పుడు ఆత్మ రూపంలో వంతెన వద్ద సంచరిస్తోందన్నది స్థానికుల అభిప్రాయం. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... ఆ కుక్కలన్నీ వంతెనకు ఒకవైపే దూకాయట!

  • Loading...

More Telugu News