: 'బాహుబలి' హిట్టవ్వడం తెలుగు సినీ పరిశ్రమకి మంచిది: మహేష్ బాబు
భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపోందిన 'బాహుబలి' సినిమా హిట్టవ్వాలని కోరుకుందామని స్టార్ హీరో మహేష్ బాబు తెలిపారు. సాధారణంగా తన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడని మహేష్ బాబు 'బాహుబలి' లాంటి సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షించాడు. హైదరాబాదులో మాట్లాడుతూ, 'బాహుబలి' హిట్ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో అవసరం అని మహేష్ బాబు అభిప్రాయపడ్డాడు. 'బాహుబలి' లాంటి సినిమాను చూసి మనమంతా గర్వపడాలని మహేష్ బాబు చెప్పాడు. తక్కువ వ్యవధిలో పెద్ద సినిమాలు విడుదల కావడం తెలుగు సినీ పరిశ్రమకు మంచిది కాదని మహేష్ బాబు తెలిపాడు. కాగా, 'బాహుబలి' కోసం సినీ పరిశ్రమ ఎదురు చూస్తున్నట్టే 'శ్రీమంతుడు' సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు.