: ఎన్నో అంశాలుండగా సెక్షన్ 8 మాత్రమే ఎందుకు గుర్తుకొస్తోంది?: ఉండవల్లి


ఓటుకు నోటు కేసులో నిందితులకు శిక్ష తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు మాట్లాడాల్సినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు అన్నీ తామై మాట్లాడుతున్నారని అన్నారు. విభజన బిల్లులో ఎన్నో అంశాలు ఉండగా, కేవలం సెక్షన్ 8 గురించే ఏపీ మంత్రులు ఎందుకు పట్టుబడుతున్నారని ఆయన నిలదీశారు. విభజన బిల్లులో ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, ఆర్థికలోటు భర్తీ... ఇలా చాలా అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News