: 'కార్గిల్ వార్ ను పాక్ ఎప్పుడో చేపట్టాల్సిందట'... వెలుగులోకి వచ్చిన కొత్త విషయం!


1999లో జరిగిన 'కార్గిల్' యుద్ధాన్ని భారత్, పాక్ ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోలేవు. ఎందుకంటే భారత్ లోని కీలకమైన ప్రాంతాలను చేజిక్కించుకుని, కాశ్మీర్ పై పట్టుసాధించేందుకు పాక్ ఆర్మీ కుతంత్రంతో యుద్ధానికి దిగగా, భారత సైనికులు సమర్థవంతంగా అడ్డుకుని, తరిమితరిమి కొట్టిన సంగతి మరవడం అసాధ్యం. అయితే 'కార్గిల్' యుద్ధం 1999 కంటే ఎంతో ముందుగా జరగాల్సిందని, 1992 నుంచి 1994 వరకు కరాచీలో 'కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా'గా పనిచేసిన రాజీవ్ డోగ్రా తెలిపారు. ఆయన రాసిన 'వేర్ బార్డర్స్ ఆర్ బ్లీడ్: ఆన్ ఇన్ సైడర్స్ ఆకౌంట్స్ ఆప్ ఇండో-పాక్ రిలేషన్స్' అనే పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఆర్మీ ప్రతిపాదనని అప్పటి పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో అంగీకరించలేదట. ఆమె ఆమోద ముద్ర పడకపోవడంతో ఆర్మీ ఆ ఆలోచనను వదిలేసిందని, ఆ తరువాత 'కార్గిల్' యుద్ధం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News