: పదిహేనేళ్ల తరువాత హైదరాబాదులో అడుగుపెట్టిన అలియా భట్


బాలీవుడ్ యువనటి అలియా భట్ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాదులో అడుగుపెట్టింది. 'కపూర్ అండ్ సన్స్' సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన అలియా విశ్రాంతి తీసుకుంటోంది. షూటింగ్స్ కు ఎలాగూ విరామం దొరికింది కదా అని, నచ్చిన ప్రదేశాలు చూసేందుకు కుటుంబ సమేతంగా హైదరాబాదు వచ్చింది. హైదరాబాదులో ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శించింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను అలియా సోదరి షహీన్ భట్ ట్విట్టర్లో పెట్టింది. చేతికట్టుతో అలియా సంతోషం వ్యక్తం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తోంది.

  • Loading...

More Telugu News