: కేసీఆర్ ఫాంహౌస్ లో స్టీఫెన్ సన్ కు ఏం పని?: జూపూడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ లను టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు నిలదీశారు. ఏపీ ప్రభుత్వంపై కేసీఆర్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం ఫాంహౌస్ లో బుధవారం నాడు స్టీఫెన్ ఉన్నారని, అసలక్కడ ఆయనకేం పనని ప్రశ్నించారు. స్టీఫెన్ ఫామ్ హౌస్ కు వెళితే తప్పులేదుగానీ... మత్తయ్య అత్తవారింటికి వెళ్లకూడదా? అని జూపూడి అడిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులో మత్తయ్య పిటిషన్ వేస్తే అక్కడి న్యాయమూర్తిని మార్చాలనే నీచ సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. అంటే రాజ్యాంగ వ్యవస్థపై వాళ్లకు నమ్మకం లేదని ఆరోపించారు. అసలు ఈ కేసులో స్టీఫెన్ పాత్రే అనుమానాస్పదంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో తెలంగాణ మంత్రులు, అధికారులు అడ్డంగా దొరికారని... దీనికేం చెబుతారని ప్రశ్నించారు.