: పుష్కరాల పనుల్లో సమర్థ పనితీరు కనబరిస్తే అవార్డులు ఇస్తాం: చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజంతా గోదావరి పుష్కరాల పనుల తీరుపై పరిశీలనలు, సమీక్షలు జరిపారు. సమయం దగ్గర పడుతుండటంతో పుష్కరాల పనులు ఎంతవరకు వచ్చాయోనని తెలుసుకునేందుకు ఈ ఉదయం రాజమండ్రి వెళ్లారు. ముందుగా హెలికాప్టర్ లో పట్టిసీమ ప్రాజెక్టు, రాజమండ్రిలోని పుష్కర పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తరువాత పూర్తయిన కోటిలింగాల ఘాట్, మిగతా పుష్కరాల పనులును సీఎం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. తరువాత ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎండోమెంట్, ఏపీపీడీసీఎల్, మున్సిపల్ కార్పోరేషన్, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఆర్టీసీ, రైల్వే, హెల్త్, ఫైర్ సర్వీస్, టూరిజం, కల్చర్ తదితర సంస్ధల అధికారులు, నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గతంలో పుష్కర పనులు సకాలంలో పూర్తయ్యాయని, ఈసారి ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులను మందలించారు. దగ్గర ఉండి పనులు పర్యవేక్షిస్తూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచి పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులు ఇస్తామని బాబు ప్రోత్సహించారు. ఫైబర్ వైర్లు ఏర్పాటుచేసి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఘాట్ ల వద్ద నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్య పెంచాలన్నారు.

  • Loading...

More Telugu News