: టాలీవుడ్ జబ్బు బాలీవుడ్ కి పాకింది


అవును, టాలీవుడ్ జబ్బు బాలీవుడ్ కి పాకింది. టాలీవుడ్ లో సినిమాలు ల్యాబ్ లో ఉండగా లీక్ అవుతూ కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది', ప్రభాస్ 'బాహుబలి' వంటి సినిమాలకు జరిగినట్టే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో రూపొందిన 'గంగాజల్-2'కు కూడా జరిగింది. అజయ్ దేవగణ్ నటించిన 'గంగాజల్' సినిమాకు సీక్వెల్ గా రానున్న 'గంగాజల్-2'లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించింది. సామాజిక సమస్యల్ని ఇతి వృత్తంగా తీసుకుని సినిమాలు రూపొందించడంలో దిట్టైన ప్రకాశ్ ఝా ఈ సినిమాకు రూపకర్త. ప్రియాంక నటించిన సన్నివేశం ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. లీక్ ఎలా అయిందా? అని ఆరాతీస్తోంది. కాగా, బాలీవుడ్ లో ప్రమోషన్ గిమ్మిక్కుల్లో ఇది కూడా ఓ భాగమేనని పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News