: బాహుబలికి పోటీగా ఉండకూడదనే శ్రీమంతుడు వాయిదా: మహేష్ బాబు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'బాహుబలి' చిత్రానికి పోటీగా ఉండకూడదనే ఉద్దేశంతోనే తన తాజా చిత్రం 'శ్రీమంతుడు'ను వాయిదా వేసినట్టు ప్రిన్స్ మహేష్ బాబు వెల్లడించారు. ఈ ఉదయం రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ గుడ్ విల్ అంబాసడర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల చిత్రాల విడుదల వద్దని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విడుదల తేదీ వాయిదా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కథ నచ్చితే బాహుబలి వంటి చిత్రాల్లో నటించేందుకు అభ్యంతరం లేదని, శృతి హసన్ చాలా మంచి నటి అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆయన ఒక్కడు చిత్రంలోని 'చెప్పవే చిరుగాలి' పాటకు స్టెప్పేసి, కొంతసేపు ఆనందంగా గడిపారు.