: స్టీఫెన్ సన్ 'నాట్ బిఫోర్ మి' పిటిషన్ పై నిర్ణయం సోమవారం
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన నాట్ బిఫోర్ మి పిటిషన్ పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని జడ్జి సోమవారానికి వాయిదా వేశారు. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్యపై న్యాయమూర్తి సరిగా విచారణ జరపకుండా ఆయన అరెస్టుపై స్టే ఉత్తర్వులు ఇచ్చారని, ఇదే న్యాయమూర్తి ఉంటే కేసులో న్యాయం జరగదంటూ స్టీఫెన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈరోజు విచారణ జరిగింది. న్యాయమూర్తి సరిగా న్యాయం చేయలేరని భావించే బెంచ్ ను మార్పు చేయాలని స్టీఫెన్ పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరపు న్యాయవాది మోహన్ రావు పేర్కొన్నారు.