: తిరుమల నడకదారిలో సెక్యూరిటీ గార్డు అదృశ్యం
పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వెళ్లే నడకదారిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అర్జున్ అదృశ్యమయ్యారు. ఈ నెల 17న నైట్ డ్యూటీలో ఉండగా ఆయన ఆచూకీ లేకుండా పోయారు. అర్జున్ పశ్చిమబెంగాల్ కు చెందిన వ్యక్తి. తిరుమల అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం, ఎర్రచందనం దొంగల ఆగడాలు ఎక్కువ అవడంతో... భారీగా సెక్యూరిటీని పెంచారు. ఈ నేపథ్యంలో, ఆచూకీ లేకుండా పోయిన అర్జున్ కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అర్జున్ అదృశ్యం కావడంతో, ఆయన కుటుంట సభ్యుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.