: రామగుండం ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి... మరో రెండు రోజుల పాటు ఇదే స్థితి


కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్ననే ఐదో యూనిట్ లో ఉత్పత్తి నిలచిపోగా, ఈ ఉదయం నాలుగో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తి ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించి, సరిదిద్దేందుకు ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది శ్రమిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే స్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీలో 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

  • Loading...

More Telugu News