: బీర్, విస్కీ, బ్రాందీలపై ఆహార భద్రతా విభాగం నజర్


ఆహార పదార్థాల్లో హానికారక రసాయనాలు కనిపెట్టేందుకు నడుం బిగించిన కేంద్ర ఆహార భద్రతా విభాగం ఎఫ్ఎస్ఎస్ఏఐ, తాజాగా మద్యం ఉత్పత్తులపై దృష్టిని సారించింది. బీరు, విస్కీ సహా అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్లలో ఏ హానికారక రసాయనాలు ఎంతున్నాయన్న విషయమై పరీక్షలు జరిపించనుంది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ ను, ఆల్కహాలిక్ పానీయాల స్టాండర్డ్స్ ను మరో రెండు నెలల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. "మద్యం తదితర ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను తయారు చేసే పనిలో నిమగ్నమై వున్నాం. మరో రెండు నెలల్లో ప్రజాభిప్రాయం కోరుతూ ముసాయిదా వెలువడుతుంది" అని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఒకరు వివరించారు. విస్కీ, వోడ్కా, జిన్, బీర్ తదితరాలతో పాటు బ్రీజర్లు కూడా నాణ్యతా ప్రమాణాల పరిధిలో ఉంటాయని ఆయన వివరించారు. కాగా, వాస్తవానికి ఇండియాలో అమలవుతున్న నిబంధనల ప్రకారం, మద్యం ఉత్పత్తులతో పాటు పాన్ మసాలా, సిగరెట్లు, సుపారీల వంటివి 'హానికారక ఉత్పత్తులు' జాబితాలో లేవు. అయితే, వీటిని స్వీకరించడం లేదా సేవించడం ద్వారా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది అని మాత్రం ప్యాక్ పై ముద్రించాల్సి వుంది.

  • Loading...

More Telugu News