: తెలంగాణలో సామాన్య ప్రజలకు అవస్థలు మొదలు!


రాష్ట్ర వ్యాప్తంగా లారీల సమ్మె సామాన్య ప్రజలకు అవస్థలు తెచ్చి పెట్టింది. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు చుక్కలను అంటుతున్నాయి. రెండు కిలోల కూరగాయలు కావాలన్నా కనీసం 100 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కిలో టమోటాల ధర రూ. 50కి చేరగా, బంగాళాదుంపల ధర రూ. 60 దాటింది. మిగతా కూరగాయలు, ఆకుకూరల పరిస్థితీ ఇలానే వుంది. ఇక సమ్మె విరమించకుంటే, మార్కెట్లోని సరుకంతా నేటితో అయిపోతుందన్న భయాలు ధరలను మరింతగా పెంచేస్తున్నాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ఆగడంతో బంకుల్లో పెట్రోలు, డీజిల్ నిండుకుంటోంది. గత రాత్రి నుంచే బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారుల క్యూలు కనిపించాయి. సమ్మె నేడు, రేపు జరిగితే ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.

  • Loading...

More Telugu News