: నేపాల్ పునర్నిర్మాణానికి భారత్ చేయూత...బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్కారు
భూకంపం ధాటికి నేలమట్టమైన నేపాల్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. నేపాల్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం నేపాల్ కు బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం సందర్భంగానూ అన్ని దేశాల కంటే ముందుగానే స్పందించిన భారత్, తక్షణ సాయంతో పాటు సహాయక సిబ్బందిని అక్కడకు పంపింది. అయితే మీ సాయం ఇక చాలంటూ భారత సహాయక సిబ్బందిని నేపాల్ తిప్పి పంపింది. తాజాగా ఈ విషయాన్ని పక్కనబెట్టేసిన మోదీ, నేపాల్ కు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.