: కదిలిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సిస్టర్లు...కాసేపట్లో సిస్టర్ నిర్మల అంత్యక్రియలు
క్యాథలిక్ సంస్థ మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్లు (నన్స్) కదిలారు. 'ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అని ప్రపంచానికి చాటి చెప్పిన మదర్ థెరెస్సా వారసురాలు సిస్టర్ నిర్మల మరణంతో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మూగబోయింది. వార్థక్యం కారణంగా మదర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సిస్టర్ నిర్మల గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గుండె సంబంధిత సమస్యతో సిస్టర్ నిర్మల మృత్యువాత పడినట్టు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రకటించింది. కాగా, నేడు సిస్టర్ నిర్మల అంత్యక్రియలు కోల్ కతాలో జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలకు శోకతప్త హృదయంతో రోమన్ క్యాథలిక్ కు చెందిన వివిధ కాంగ్రిగేషన్ల నుంచి సిస్టర్లు (నన్స్), ఫాదర్లు, బిషప్ లు హాజరుకానున్నారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం సిస్టర్ ప్రేమ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.