: నిలబడలేకపోయిన రోహిత్, కోహ్లీ...టీమిండియా 153/2
రెండు వరుస ఓటముల తరువాత కూడా టీమిండియా టాప్ ఆర్డర్ ఆటతీరు మారలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (71) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, రోహిత్ శర్మ (29) మాత్రం విఫలమయ్యాడు. తొలుత నిలదొక్కుకునేలా కనిపించిన రోహిత్, ముస్తఫిజుర్ కు మరోసారి దొరికిపోయాడు. అనంతరం ధావన్ కు జత కలిసిన వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (25) షకిబ్ అల్ హసన్ కు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. క్రీజులో ధావన్, కెప్టెన్ ధోనీ (23) ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ ప్రయత్నిస్తుండగా, క్లీన్ స్విప్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతోంది.