: చివరి వన్డేలో కొత్త సీన్... పోలీసు కాపలా నడుమ 'మువ్వన్నెల జెండా' రెపరెపలు


మైదానంలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో పిచ్ లకు కూడా రక్షణ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే, ఓ అభిమానికి పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా? ఆ సీన్ ఇవాళ (బుధవారం) కనిపించింది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ కు టీమిండియా వీరాభిమాని, సచిన్ భక్తుడు సుధీర్ గౌతమ్ హాజరయ్యాడు. స్టాండ్స్ లో కూర్చున్న సుధీర్ కు నాలుగు వైపులా పోలీసులు కూర్చున్నారు. ఇక, ఎప్పటిలానే సుధీర్ తన పని తాను మొదలుపెట్టాడు. త్రివర్ణ పతాకాన్ని గాల్లో రెపరెపలాడిస్తూ, శంఖం ఊదుతూ భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచే పనిలో నిమగ్నమయ్యాడు. ఇక, సుధీర్ కు కాస్త వెనుకగా కూర్చున్న బంగ్లాదేశ్ వీరాభిమానికి కూడా ఇద్దరు పోలీసులు రక్షణగా ఉండడం ఆసక్తిగొలిపింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ముగిసిన తర్వాత స్టేడియం వెలుపల సుధీర్ పై బంగ్లా ఫ్యాన్స్ దాడికి యత్నించడంతో పోలీసులతో అతడికి భద్రత ఏర్పాటు చేశారు. సుధీర్ కు టీమిండియా క్రికెటర్లు కూడా ధైర్యం చెప్పారు. ఏ సమస్య వచ్చినా తమకు తెలియజేయాలంటూ అతడిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News