: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారైంది. జులై 21 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు వారాలపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్ డీఏ ఏడాది పరిపాలన, భూ సేకరణ చట్టం, ప్రస్తుతం వివాదం రేపిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజెలపై విమర్శల అంశాలపై ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలు మరింత హాట్ హాట్ గా జరిగిే అవకాశం ఉందని చెప్పొచ్చు.